బిగ్‌బాస్ సీజన్ 4తో మంచి పాపులారిటీ సాధించుకుంది దివి వడ్త్య. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్ళే ముందు తెలుగు ప్రేక్షకులకు ఆమె కొంత మేరకే తెలుసు. అయితే మోడల్‌గా పలు షోస్‌లో సందడి చేసిన దివి “మహర్షి” సినిమాలో కూడా నటించింది. అయితే బిగ్‌బాస్ ద్వారా బుల్లితెర వీక్షకులతో పాటు వెండితెర ప్రేక్షకులకు కూడా దివి మరింత దగ్గరయ్యింది. తా నవ్వు, సొట్టబుగ్గలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దివికి ఈ మధ్య అవకాశాలు వెల్లువలా వస్తున్నాయని తెలుస్తుంది.
అయితే అందంగా కనిపించడంతో పాటు చక్కటి అభినయం ప్రదర్శించగల కథానాయిక పాత్రలకు దివి మంచి ఆప్షన్ అని టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటికే కొందరు ఆమెను సంప్రదించగా వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా, మంచి కథలు చేయాలని దివి భావిస్తుందని ఆమె సన్నిహితులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే రెండు మూడు చిత్రాల్లో దివి కథానాయికగా ఎంపికయ్యిందని పూర్తి వివరాలు త్వరలో ఆ సినిమాల దర్శక, నిర్మాతలు వెల్లడిస్తారని తెలుస్తుంది.


