బిగ్ బాస్ కి వెళ్లనంటున్న బోల్డ్ హీరోయిన్ !

Published on Jun 7, 2021 11:33 am IST

‘బిగ్ బాస్ తెలుగు -5’ సీజన్ ఆగస్టులో మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే, హీరోయిన్ ‘పాయల్ రాజపుత్’ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పిందని వస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఇక స్టార్ మా బిగ్‌బాస్ 5 సీజన్‌ కు కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. ఈ సారి షోలో ఉత్కంఠత పెంచేందుకు నిర్వాహకులు భారీగా స్కెచ్ లను సిద్ధం చేస్తున్నారట.

బిగ్ బాస్ విజేత ఎవరన్న సస్పెన్స్‌ లాస్ట్ ఎపిసోడ్ వరకూ అలాగే ఉంచాలని మేకర్స్ సిద్ధం అవుతున్నారట. అలాగే కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ జర్నీని కూడా ఈ సారి కొత్తగా ప్లాన్ చేయబోతున్నారట. ఇక బిగ్ ‌బాస్ మొదలైందంటే చాలు అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేస్తున్నారట. మొదటి సీజన్ నుండి ఈ షోకి వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వస్తోంది.

సంబంధిత సమాచారం :