ఈ ఇద్దరికీ వోట్ చేయమంటున్న “బిగ్ బాస్” ఫేమ్ హిమజ.!

Published on Nov 24, 2020 8:00 am IST

ఇప్పుడు మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి “బిగ్ బాస్ 4” మరింత రసవత్తరంగా మారింది. మరీ ముఖ్యంగా నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ అయితే ఒకింత కాంట్రవర్సీ మరియు ఎమోషనల్ గా సాగింది. అయితే ఈ నామినేషన్స్ లో లాస్ట్ మినిట్ లో సేఫ్ జోన్ లో ఉన్నటువంటి మోనాల్ నామినేషన్స్ లోకి వచ్చింది. అది కూడా ఊహించని ట్విస్టులు ఇచ్చి మరీ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈమెకు వోట్ చెయ్యాలని గత సీజన్ ఫిమేల్ కంటెస్టెంట్ అయినటువంటి హిమజ చెబుతుంది. అలాగే మోనాల్ తో పాటుగా ఇప్పుడున్న మరో ఫిమేల్ కంటెస్టెంట్ అయినటువంటి అరియానాకు కూడా వోట్ చెయ్యాలని తన సోషల్ మీడియాలో తెలిపారు. అలాగే తాను కూడా వీరిద్దిరికీ వోట్ చేసానని తెలిపింది. మొత్తానికి మంచి రసవత్తరంగా మారిన ఈ నామినేషన్స్ లో ఎవరు ఈ వారాంతం ఎలిమినేట్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More