బిగ్ బాస్ హౌజ్ లోకి ఓ చిన్నస్థాయి సెలెబ్రెటీగా ఎంటర్ అయిన కౌశల్, సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ గ్రూపుల సాయంతో, బిగ్ బాస్ సీజన్ 2 ముగిసే సరికి ఓ స్టార్ స్టేటస్ సంపాధించుకున్నాడు. చివరకు టైటిల్ నే గెలుచుకున్నాడు. ఇప్పుడు ఏకంగా సినిమా హీరోగా మారబోతున్నాడు. కౌశల్ ఆర్మీ గ్రూపుల అన్ని కలిసి కౌశల్ ని హీరోగా పెట్టి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన కౌశల్, ప్రస్తుతం సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.
ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని హీరోగా అయ్యే ఛాన్స్ వచ్చింది. అయితే కౌశల్ ఆర్మీ గ్రూపుల అన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా నాలుగు కోట్ల బడ్జెట్ తో సినిమా చేయబోతున్నారట. మరి ఈ సినిమాతో కౌశల్ సినిమాల్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.


