బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?

బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?

Published on Apr 5, 2022 12:47 AM IST

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో అప్పుడే ఐదు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో లో మొదటి వారం వారియర్స్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఆమె గత వారమే మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక రెండో వారం ఛాలెంజర్స్ నుంచి శ్రీరాపాక, మూడో వారం వారియర్స్ నుంచి ఆర్జే చైతూ, నాలుగో వారం వారియర్స్ నుంచి సరయు, నిన్న తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయ్యింది.

ఇదిలా ఉంటే హౌస్‌లో ఈ వారం నామినేషన్స్‌ రసవత్తరంగా సాగినట్టు ఉంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే ఈ వారం అజయ్‌, అషూ, మిత్ర, మహేశ్‌, హమీదా, అరియానా, నటరాజ్‌, అనిల్‌ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు