అదిరిపోయిన బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ ప్రోమో..!

అదిరిపోయిన బిగ్‌బాస్ ఓటీటీ తొలి సీజన్ ప్రోమో..!

Published on Feb 15, 2022 7:47 PM IST

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంటర్‌టైన్‌మెంట్‌ బాప్‌గా నిలిచిన ఈ షో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు ఇప్పుడు ఓటీటీ ద్వారా 24 గంటల పాటు ప్రసారం కానుంది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానున్న ఈ షోకి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన మేకర్స్ ఫిబ్రవరి 26 నుంచి ఈ ఓటీటీ షో మొదలవుతుందని ప్రకటించారు.

ఈ ప్రోమోలో ఓ ఖైదీకి ఉరిశిక్ష పడగా, అతడి చివరి కోరికగా బిగ్‌బాస్‌కి సంబంధించి ఒక్క ఎపిసోడ్‌ని చూడాలనుకుంటాడు. ఖైదీ కోరిక మేరకు షోని ప్రసారం చేయగా నాన్ స్టాప్‌గా ప్రసారమయ్యే బిగ్‌బాస్‌ షో కు ఎండ్ ఉండదు. దీంతో ఆ ఖైదీకి ఉరిశిక్ష పడదనే ఫన్నీ కాన్సెప్ట్‌తో ప్రోమోని తెరకెక్కించారు. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్‌గా బిగ్‌బాస్ ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో ఉరిశిక్ష పడిన ఖైదీగా వెన్నెల కిషోర్, లాయర్‌గా నాగార్జున, పోలీస్ ఆఫీసర్‌గా మురళీ శర్మ కనిపించి అలరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు