బిగ్‌బాస్ 5: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కంటెస్టెంట్స్ లిస్ట్..!

బిగ్‌బాస్ 5: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కంటెస్టెంట్స్ లిస్ట్..!

Published on Jul 17, 2021 12:53 AM IST

తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ రియాలిటీ షో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకుంది. అయితే ఐదో సీజన్ ఎప్పుడెప్పుడా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఆగష్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో ఈ షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈ సీజన్‌కు దగ్గుబాటి రానా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇవన్ని పక్కన పెడితే ఈ సారి హౌస్‌లోకి ఎవరెవరు వెళుతున్నారన్నది ప్రధానంగా ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం.

కరోనా పరిస్థితుల నేపధ్యంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆధారంగానే నిర్వాహకులు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి హౌస్‌లోకి వెళ్ళే వారి జాబితా ఇదే అంటూ ఓ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఆ లిస్ట్ చూస్తే యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, గెటప్ శ్రీను, రఘు మాస్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా, సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా, యూట్యూబర్ సిరి హనుమంతు, లోబో, సింగర్ మంగ్లీ, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు, సీరియల్ నటులు సిద్ధార్థ్ వర్మ అండ్ భార్య విష్ణు ప్రియ, టీవీ 9 ప్రత్యూష పేర్లు అందులో ఉన్నాయి. అయితే దీనిపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు