బిగ్‌బాస్4 విన్నర్ అభిజిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!

Published on Jul 3, 2021 8:08 pm IST

సినీ నటుడు అభిజిత్ బిగ్‌బాస్ సీజన్-4లో చాలా తెలివిగా గేమ్ ఆడి విన్నర్‌గా నిలవడమే కాకుండా ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ షో త‌ర్వాత అందరూ బిజీ అయినా అభిజిత్ మాత్రం ఇంతవరకు కెరీర్ మొదలు పెట్టలేదు. అయితే తాజా న్యూస్ చూస్తుంటే అభిజిత్ ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశాలు కష్టమే అనిపిస్తుంది. అయితే గ‌తంలో జ‌రిగిన ఓ యాక్సిడెంట్ వ‌ల‌న భుజానికి గాయం కావ‌డంతో అభిజిత్ బిగ్‌బాస్ హౌస్‌లో కూడా పెద్దగా ఫిజికల్ టాస్కులు ఆడలేకపోయాడన్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవ‌ల మంచి ఫిజిక్ కోసం భారీగా వ‌ర్క‌వుట్స్ చేయ‌గా తాజాగా ఆ గాయం మరింత ఎక్కువవడంతో అభిజిత్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని అభిజితే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తాను యాక్టివ్‌గా ఉండడంలేదని, మీతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండేందుకు చాలా ప్రయత్నించానని అన్నారు. అయితే గత వారం నుంచి భుజానికి అయిన గాయం మరింత బాధపెడుతుంటే ఆసుపత్రికి వెళ్లానని త్వరగా తిరిగి వస్తానని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ విష‌యం తెలిసిన అభిమానులు అభిజిత్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.

సంబంధిత సమాచారం :