ఆ సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్ అయిపోయానన్న బిగ్‌బాస్ బ్యూటీ..!

Published on Aug 12, 2021 10:03 pm IST

బిగ్‌బాస్ ద్వారా బుల్లితెర వీక్షకులతో పాటు వెండితెర ప్రేక్షకులకు దివి మరింత దగ్గరయ్యింది. తన నవ్వు, సొట్టబుగ్గలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న దివి సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్‌గా కూడా బాగానే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన దివి హీరో ప్రభాస్ గురుంచి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అయితే తనకు హీరో ప్రభాస్ అంటే చాలా ఇష్టమని, ఆయన అంటే క్రష్ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్‌కు తాను పెద్ద ఫ్యాన్‌ అయిపోయానని, అప్పటి నుంచి ఐ లవ్ యూ మెసేజ్‌లు ఆయనకు పంపిస్తుండేదానినని చెప్పింది. అవకాశం వస్తే ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :