రామ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ‘బిగిల్’ నటి

Published on Jan 31, 2020 1:41 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్ చేస్తున్న కొత్త చిత్రం ‘రెడ్’. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి హిట్ తర్వాత రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. తమిళ్ మూవీ ‘తాడం’కు ఇది రీమేక్. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. అందుకే ఇందులో ఇద్దరు కథానాయికల్ని తీసుకున్నారు. మొదటి కథానాయికగా మాళవిక శర్మను ఎంపిక చేసిన టీమ్ రెండో హీరోయిన్ పాత్ర కోసం అమృత అయర్ ను తీసుకున్నారు.

ఈమె విజయ్ తాజా హిట్ చిత్రం ‘బిగిల్’లో మహిళా పుట్ బాల్ జట్టులో సభ్యురాలిగా నటించింది. ఈమెకు తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఇకపోతే ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమల డైరెక్ట్ చేయనుండగా స్రవంతి మూవీస్ బ్యానర్ మీద స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం ఎప్రిల్ 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :