ఆఖరి దశ షూటింగ్‌లో స్టార్ హీరో సినిమా

Published on Jun 26, 2019 1:07 pm IST

సౌత్ స్టార్ హీరో విజయ్ చేస్తున్న కొత్త సినిమా ‘బిజిల్’. అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ ముగిసినట్టు తెలుస్తోంది. మిగతా భాగం జూలై చివరికి ముగుస్తుందని, ఆగష్టు నెలలో విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అట్లీ గతంలో విజయ్ హీతోగా ‘తేరి, మెర్సల్’ లాంటి భారీ హిట్లు తీసి ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పైగా ఇందులో విజయ్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారనే టాక్ కూడా ఉంది. నయనతార కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘మెర్సల్’ తెలుగులో ‘అదిరింది’ పేరుతో విడుదలై మంచి వసూళ్లు రాబట్టడంతో ‘బిజిల్’ కూడా తెలుగునాట భారీ ఎత్తున విడుదలయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More