సౌత్ ఇండియాలో సాహో తరువాత బిగిల్ మూవీనే

Published on Oct 23, 2019 1:25 pm IST

తలపతి విజయ్ గత చిత్రాలకు మించిన హైప్ బిగిల్ మూవీ పై నెలకొంది. దాదాపు 180కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు కూడా మాములుగా లేవు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో బిగిల్ దుమ్ము రేపుతుంది. అట్లీ-విజయ్ ల హిట్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడం మరియు విజయ్ మూడు భిన్న లుక్స్ లో కనిపించడం అంచనాలు పెరిగేలా చేసింది. కాగా బిగిల్ మూవీ కి మరో అరుదైన గౌరవం దక్కింది. బిగిల్ చిత్రానికి ట్విట్టర్ ప్రత్యేకమైన ఎమోజి సింబల్ ఇవ్వడం జరిగింది. సౌత్ లో ఆ గౌరవం దక్కించుకున్న రెండవ మూవీగా బిగిల్ నిలిచింది.

గతంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి ట్విట్టర్ ఎమోజీ కేటాయించారు.సాహో ట్విట్టర్ ఎమోజీ పొందిన మొదటి సౌత్ ఇండియన్ మూవీగా రికార్డులకెక్కింది. ఇప్పుడు బిగిల్ మూవీ కూడా ఈ లిస్ట్ లో చేరింది. విజయ్ కి జంటగా నయనతార నటిస్తున్న బిగిల్ దీపావళి కానుకగా ఈనెల 25న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల అవుతుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైంది. ఇదే రోజున కార్తీ నటించిన ఖైదీ చిత్రం విడుదల కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

More