‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!

BIker and Rakassa 1

శర్వానంద్ నటించిన ‘బైకర్’, సంగీత్ శోభన్ ‘రాకాస’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీని ప్రదర్శిస్తున్నాయి. వీకెండ్ వసూళ్లలో స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ స్వల్ప ఆధిక్యంలో ఉండగా, గత మూడు రోజులుగా బుక్ మై షో టికెట్ బుకింగ్స్‌లో ఫాంటసీ కామెడీ ‘రాకాస’ హవా కొనసాగించింది.

​అయితే, గత 24 గంటల్లో ట్రెండ్ మారింది. లేటెస్ట్ డేటా ప్రకారం, ‘బైకర్’ సుమారు 15.5 వేల టికెట్లతో మళ్ళీ పుంజుకోగా, ‘రాకాస’ 13.7 వేల టికెట్ల వద్ద నిలిచింది.

సోమవారం కావడంతో రెండు సినిమాల వసూళ్లలో సాధారణ డ్రాప్ కనిపించినప్పటికీ, ఈ వారం కొత్త సినిమాలు వచ్చే వరకు ఇవి ఎంతవరకు నిలకడగా రాణిస్తాయో చూడాలి.

Exit mobile version