సక్సెస్ఫుల్ గా 50 డేస్ కంప్లీట్ చేసుకున్న కళ్యాణ్ రామ్ ‘బింబిసార’

Published on Sep 24, 2022 1:30 am IST


నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ గ్రాండియర్ విజువల్ సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. క్యాథరీన్ త్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుండి టాలీవుడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ తరువాత భారీ సక్సెస్ అందుకుంది బింబిసార. కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కూడా తన అత్యద్భుత నటన కనబరచగా మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా యువ దర్శకుడు వశిష్ట ఎంతో అద్బుతంగా తెరకెక్కించారు.

భారీ యాక్షన్ సీన్స్, విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఫైట్స్ వంటివి బింబిసార సూపర్ సక్సెస్ కి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇక ఈ మూవీ విడుదలై నేటితో సక్సెస్ఫుల్ గా 50 రోజలు పూర్తి అవడంతో తమ మూవీని ఎంగానో ఆదరించిన ప్రేక్షకాభిమానులకి ప్రత్యేకంగా బింబిసార టీమ్ తమ సోషల్ మీడియా ఆసీకాంట్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియచేసింది. అలానే పలువురు ప్రేక్షకాభిమానులు ఈ మూవీ 50 డేస్ సక్సెస్ సందర్భంగా యూనిట్ కి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో శుభాభినందనలు తెలియచేస్తున్నారు. ఇక అతి త్వరలో ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ కి సంబందించిన డీటెయిల్స్ కూడా అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :