‘టక్ జగదీష్’కి బైపోలార్ డిజార్డర్ ?

Published on Aug 9, 2020 12:35 am IST

టాలీవుడ్ లోని మినిమం గ్యారంటీ హీరోల్లో ఒకరైన నేచురల్ స్టార్ ‘నాని’ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషనులో తయారవుతున్న సినిమా ఇది. కాగా ఈ సినిమాలో నాని డిఫరెంట్ క్యారెక్టర్ ట్రే చేస్తున్నాడట. సినిమాలో ఒక బైపోలార్ డిజార్డర్ క్యారెక్టర్ లో నాని నటిస్తున్నట్లు తెలుస్తోంది. బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో మానసిక అసమతౌల్యతలు విపరీతంగా ఉంటాయి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోను కావడం, అలాగే బాధగా వెరీ ఎమోషనల్ కావడం లాంటివి అన్నమాట.

ఇక నానితో ఇదివరకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటించిన రీతు వర్మ, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్ ఐశ్వర్యా రాజేష్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. మరి నిన్నుకోరితో హిట్ అందుకున్న ఈ హిట్ కాంబినేషన్ ఆ హిట్ మేజిక్ ను రిపీట్ చేస్తోందా..? చూడాలి.

కాగా నానికి 26వ చిత్రంగా రానున్న ఈ సినిమాని షైన్ స్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తారాగణం విషయానికి వస్తే.. సీనియర్ హీరో జగపతిబాబు, నాజర్, రావు రమేష్, నరేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More