మాసివ్ లైనప్ తో రెడీగా ఉన్న బర్త్ డే బాయ్ నిఖిల్.!

Published on Jun 1, 2021 11:00 am IST

మొదటగా సాదా సీదా సినిమాలతోనే అందులోని చిన్న రోల్ తోనే కెరీర్ ఆరంభించిన యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. అప్పటి వరకు రొటీన్ సినిమాల లైనప్ నుంచి “స్వామి రారా” తో సెపరేట్ ట్రాక్ టాలీవుడ్ లో తనకి సెట్ చేసుకున్నాడు. అలా అక్కడ నుంచి మన టాలీవుడ్ లో ఒక సరికొత్త థ్రిల్లర్ సినిమా అంటే మొదటగా తన పేరే గుర్తు చేసుకునేలా చేసాడు.

మరి అలాంటి నిఖిల్ ఇపుడు టాలీవుడ్ నుంచి మినీ సోనూ సూద్ లా మారాడు. అవసరమైన వారికి బ్లడ్ కావాలంటే, మెడిసిన్స్, ఆక్సిజన్ ఇలా అవసరమైంది ప్రతి ఒక్కటి సమకూరుస్తూ రియల్ హీరోగా మారాడు. మరి ఓ పక్క ఈ సేవలు చేస్తూనే తన పుట్టినరోజు ఈరోజు వచ్చేసింది. దీనితో సినీ ప్రేక్షకులు సహా నెటిజన్స్ కూడా నిఖిల్ కు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరి ఈ పుట్టినరోజుకి నిఖిల్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఆల్రెడీ సుకుమార్ రైటింగ్స్ నుంచి ఆసక్తికర చిత్రం “18 పేజెస్” ఫస్ట్ లుక్ రాగా, “కార్తికేయ 2”, అలాగే తనకి బ్రేక్ ఇచ్చిన “స్వామి రారా” సీక్వెల్ కూడా కార్డ్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మరో స్పై థ్రిల్లర్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం నిఖిల్ నుంచి రాబోయే రోజుల్లో సాలిడ్ చిత్రాలు మనం విట్నెస్ చెయ్యొచ్చని చెప్పాలి. చివరిగా ఈ యువ సేవక హీరో మరిన్ని ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :