వెంకటేష్ సినిమాలో బిత్తిరి సత్తి పాత్ర ఇదే !

తేజ దర్శకత్వంలో వెంకటేష్ నటించబోతున్న సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 నుండి వైజాగ్ లో ప్రారంభం కానుంది. వెంకటేష్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించబోతుండగా ప్రముఖ బుల్లి తెర సెలబ్రిటీ బిత్తిరి సత్తి ప్యూన్ పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకటేష్, బిత్తిరి సత్తిల మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉండబోతున్నట్లు సమాచారం.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇషా రెబ్బ నారా రోహిత్ కు జోడిగా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగష్టులో సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.