ఓటిటిలో ‘భగవంత్ కేసరి’ కి బ్లాస్టింగ్ రెస్పాన్స్

ఓటిటిలో ‘భగవంత్ కేసరి’ కి బ్లాస్టింగ్ రెస్పాన్స్

Published on Nov 25, 2023 7:10 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ మూవీ భగవంత్ కేసరి. శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

థమన్ సంగీతం అందించిన ఈ మూవీ అటు థియేటర్స్ లో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్న అనంతరం నిన్న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చింది. కాగా తాజాగా ఈ మూవీకి బ్లాస్టింగ్ రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుండడంతో పాటు ప్రస్తుతం అమెజాన్ లో ఆ మూవీ ఇండియన్ వైడ్ టాప్ లో ట్రెండ్ అవుతోంది. కాగా తమ మూవీకి ఓటిటి ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్సాన్స్ లభిస్తుండడంతో భగవంత్ కేసరి టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు