అనిల్ ఫుల్ స్క్రిప్ట్ కి బాలయ్య గ్రీన్ సిగ్నల్ !

Published on Jul 5, 2021 4:47 pm IST


డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ ఇప్పటికే బాలయ్య కోసం కథను పూర్తి చేశారని తెలుస్తోంది. ఆల్ రెడీ కథ విషయమై బాలయ్యతో అనిల్ సంప్రదింపులు కూడా జరిపారట. బాలయ్య ఫుల్ స్క్రిప్ట్ విని అనిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇక అఖండ చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో బాలయ్య తన తర్వాతి సినిమాల విషయంలో కూడా స్పీడ్ పెంచాడు.

అయితే అనిల్ – బాలయ్య లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఇక అక్టోబర్ నుండి ఫుల్ యాక్షన్ తో పాటు ఫన్ తో సాగే వీరి సినిమా మొదలు కానుంది. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రస్తతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం :