నితిన్ కి క్రేజ్ తెచ్చిపెట్టిన దిల్ కి 17ఏళ్ళు

Published on Apr 4, 2020 10:00 pm IST

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ దిల్ మూవీ విడుదలై నేటికి 17ఏళ్ళు అవుతుంది. హీరో నితిన్ సెకండ్ సినిమాగా వచ్చిన దిల్ ఏప్రిల్ 4, 2003న విడుదలైంది. ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న రాజుని దిల్ రాజు చేసిన సినిమా ఇదే. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు ఈ చిత్రంతో ప్రొడ్యూసర్ గా మారాడు. దర్శకుడు వి వి వినాయక్ కి దిల్ మూడవ చిత్రం. అప్పటికే ఆయన ఎన్టీఆర్ తో ఆది, బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి చిత్రాలు చేశారు. దిల్ మూవీని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

దర్శకుడు తేజ తెరకెక్కించిన జయం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నితిన్ కి వెంటనే దిల్ మూవీ రూపంలో మరో బ్లాక్ బస్టర్ అందింది. ఈ మూవీలో నితిన్ కి జంటగా నేహా నటించింది. ప్రధాన విలన్ గా చేసిన ప్రకాష్ రాజ్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. వేణు మాధవ్, ఎంఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరామ్ కామెడీ సినిమాలో మరో ఆకర్షణ అని చెప్పాలి. ఆ సమయంలో సూపర్ ఫార్మ్ లో ఉన్న ఆర్ పి పట్నాయక్ ఈ మూవీకి సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. మొత్తంగా ఓ సూపర్ కాంబినేషన్ లో వచ్చిన దిల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని నితిన్ కి హీరోగా మంచి పునాది వేసింది.

సంబంధిత సమాచారం :

X
More