మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తాము అనుకున్న గుర్తింపు అందుకొని మంచి సక్సెస్ సాధించింది. అయితే థియేటర్స్ నుంచి ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు వచ్చేసింది.
ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో నేటి నుంచే సౌత్ భాషల్లో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. అలానే ఫ్యాన్స్ కి ఇక్కడ మరో గుడ్ న్యూస్ ఏంటంటే అనుకున్నట్టు గానే కొత్త సీన్స్ తోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. సో అప్పుడు థియేటర్స్ లో కొత్త సీన్స్ చూడడం మిస్ అయ్యినవారు ఈసారి చూడొచ్చు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలానే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. వృద్ది సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


