వరల్డ్ వైడ్ పాపులర్ అయినటువంటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థలలో నెట్ ఫ్లిక్స్ కూడా ఒకటి. ఇందులో పాపులర్ అయినటువంటి పలు ఇండియన్ కంటెంట్ లో బోల్డ్ ఆంతాలజీ చిత్రం లాస్ట్ స్టోరీస్ కూడా ఒకటి రెండు సినిమాలు గా వచ్చిన ఈ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇక కొనసాగింపుగా మరిన్ని కొత్త కథలతో వచ్చిన పార్ట్ 3 నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
సిద్ధార్థ్, కృతి సనన్, అలీ ఫజల్ తదితర పాపులర్ తారగణంలో దర్శకుడు విక్రమ్ ఆదిత్య మోత్వానే తెరకెక్కించారు. ఇక అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ బోల్డ్ డ్రామా నెట్ ఫ్లిక్స్ లో ఈ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఒరిజినల్ హిందీ సహా డబ్బింగ్ తెలుగు, ఇంగ్లీష్ లలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. గత సీజన్ లలో కీయారా అద్వానీ, తమన్నాలు సూపర్ హైలైట్ అయ్యారు. ఇక ఈసారి ఎవరు రచ్చ లేపి వైరల్ అవుతారో చూడాలి.


