దేవదాస్ తో ఆ నటుడు టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు !

Published on Sep 24, 2018 12:06 pm IST


అగ్ర హీరో నాగార్జున అలాగే సహజ నటుడు నాని లు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘దేవదాస్’ విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈచిత్రంతో తెలుగు తెరకు ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నాడు బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్. ఇంతకుముందు ఆయన హిందీలో ‘రంగ్ దే బసంతి, డాన్ 2, గోల్డ్’ వంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈసినిమా తరువాత ఆయన మరిన్ని తెలుగులో సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా రజినీకాంత్, కమల్ హాసన్ ,నాగార్జున అంటే చాలా ఇష్టమని తాజా ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.

ఇక ‘భలేమంచి రోజు’ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ నటించగా నాని కి జోడిగా రష్మిక నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ చిత్రంపై అంచనాలను పెంచింది. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందించిన ఈచిత్రం ఈనెల 27న భారీ స్థాయిలో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :