పింక్ రీమేక్ లో జాయిన్ అయిన బాలీవుడ్ నటి !

పింక్ రీమేక్ లో జాయిన్ అయిన బాలీవుడ్ నటి !

Published on Apr 2, 2019 12:19 AM IST

vidyabalan1

తల అజిత్ ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. నెర్కొండ పరవాయ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈచిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ నటి విద్యాబాలన్ పాల్గొంటుంది. ఈ సినిమాలో ఆమె ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.

ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జెర్సీ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ ఒరిజినల్ వెర్షన్ లో తాప్సి నటించిన పాత్రలో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు