గుండెపోటుకు గురైన సుస్మిత సేన్ – సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

Published on Mar 2, 2023 9:33 pm IST

బాలీవుడ్ లో సీనియర్ నటిగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి ఆడియన్స్ నుండి మంచి పేరు సొంతం చేసుకున్నారు సుస్మిత సేన్. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సరసన రక్షకుడు మూవీలో నటించి తెలుగు ఆడియన్స్ ని కూడా అలరించారు సుస్మిత. ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా యాక్టివ్ గా ఉండే సుస్మిత సేన్, తాజాగా ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు. నీ గుండెని ఎప్పుడూ ధైర్యంగా సంతోషంగా ఉంచు, కష్టకాలంలో అది నీకు అండగా ఉంటుంది అంటూ తన తండ్రి సుబీర్ సేన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఆయనతో కలిసి దిగిన ఒక పిక్ ని పోస్ట్ చేసారు సుస్మిత సేన్.

ఇక తాను రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానని, అనంతరం తనకు చికిత్స అందించిన డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేసారని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. మీ గుండె ఎంతో గట్టిది అంటూ డాక్టర్లు నవ్వుతూ తనకు భరోసా అందించారని, మళ్ళి తాను సరికొత్త జీవితం ఆరంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. మీ అందరికీ ఈ విషయం తెలియాలనే ఈ పోస్ట్ చేస్తున్నాను అంటూ ఒకింత ఎమోషనల్ గా తెలిపారు సుస్మిత. కాగా ఈ పోస్ట్ చూసిన పలువురు ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు సుస్మిత త్వరగా కోలుకోవాలి అని కోరుతూ గెట్ వెల్ సూన్ మేడం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :