ఓటిటి రంగంలో అడుగు పెట్టిన బాలీవుడ్ బాద్షా.!

Published on Mar 15, 2022 3:05 pm IST


ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇపుడు ఎంతో పాపులర్ అవుతున్న డిజిటల్ కంటెంట్ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ రంగంలో పలు ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉండగా మన దేశం నుంచి కూడా కొన్ని ఉన్నాయి. మరి ఇపుడు డిజిటల్ ప్రపంచంలోకి తన మార్క్ ని చూపించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

అయితే దీనికి గాను ఎస్ ఆర్ కె ప్లస్ అనే బ్రాండ్ టైటిల్ ని ఫిక్స్ చెయ్యడమే కాకుండా తన ఓటిటి సంస్థ తాలూకా లోగో ని కూడా రిలీజ్ చేశారు. దీనితో ఇండస్ట్రీ వర్గాల్లో షారుఖ్ ఓటిటి కోసం హాట్ టాపిక్ గా స్టార్ట్ అయ్యింది. అలాగే దీనిని అతి త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు షారుఖ్ తెలిపాడు. మరి ప్రస్తుతం అయితే తాను “పటాన్” అనే భారీ సినిమా చేస్తుండగా దీనితో పాటుగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తో ఓ సాలిడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీనిపై కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :