‘బంగార్రాజు’ కోసం బాలీవుడ్ బ్యూటీ ?

Published on May 6, 2021 10:00 pm IST

కింగ్ నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ కూడ నిర్ణయించారు. ఇన్నాళ్లు పలు మార్పులకు గురైన ఈ సినిమా స్క్రిప్ట్ ఎట్టకేలకు ఫైనల్ అయింది. దీంతో ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

ఇక ఇందులో కథానాయకిగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను తీసుకోవాలని చూస్తున్నారట. సోనాక్షి అయితే తెలుగుదనం కనిపిస్తుందని, అలాగే నాగ్ సరసన కొత్తగా ఉంటుందనేది ఆలోచనట. ఈ మేరకు ఆమెతో చర్చలు జరుపుతున్నారని ఫిలిం నగర్ టాక్. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నుండి ఆరంభమవుతుందని నాగార్జున గతంలో స్వయంగా చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను నిలపనున్నారు.

సంబంధిత సమాచారం :