అల్లు అర్జున్ స్టెప్పులకు ఫిదా అయిన బాలీవుడ్ బ్యూటీ

Published on Mar 31, 2020 7:30 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సులంటే అభిమానులకు ఎంత క్రేజ్ ఉందో సినీ తారల్లో కూడా అంతే క్రేజ్ ఉంది. ఇప్పటికే పలువురు హీరో హీరోయిన్లు బన్నీ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి పొగడగా తాజాగా వారి జాబితాలోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కూడా చేరింది. ఈమధ్యే విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘బుట్ట బొమ్మా’ పాటకు బన్నీ వేసిన స్టెప్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఆ పాటను వీక్షించిన దిశా పఠానీ ప్రత్యేకంగా ఒక మూమెంట్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్.. ఈ స్టెప్ ఎలా చేయగలిగావ్ అంటూ అడగ్గా బన్నీ సమాధానం ఇస్తూ నాకు సంగీతం అంటే ఇష్టం.. మంచి సంగీతం నాచేత ఇలాంటి డ్యాన్సులు చేయిస్తుంది అన్నారు. సో.. బన్నీ నృత్యాలకు
టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా సెలబ్రిటీ ఫ్యాన్స్ తయారయ్యారు.

సంబంధిత సమాచారం :

X
More