‘భారతీయుడు’లో బాలీవుడ్‌ హీరో !

Published on Aug 7, 2018 9:45 am IST

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తమిళ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ ల కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నాడు దర్శకుడు శంకర్‌. అయితే తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసనే చెప్పారు.

కమల్‌ మీడియాతో మాట్లాడుతూ అజయ్‌ దేవగణ్‌ నటిస్తున్నట్లు నాకూ తెలిసింది. ఇది పూర్తిగా మా దర్శకుడు శంకర్ నిర్ణయం అని కమల్ తెలిపారు. ఈ చిత్రానికి హిందీలో కూడా క్రేజ్ రావాలంటే అక్కడి స్టార్స్ ఉండాలి. అందుకే బాలీవుడ్‌ నటుల్ని కూడా తీసుకోవాలని దర్శకుడు శంకర్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.

సంబంధిత సమాచారం :

X
More