“కాంతార” పై హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“కాంతార” పై హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Dec 11, 2022 11:15 PM IST

కన్నడలో చిన్న చిత్రం గా విడుదల అయ్యి, దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కాంతార. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించిన దానికంటే ఎక్కువగానే వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు లను నెలకొల్పింది. ఈ చిత్రం లో రిషబ్ శెట్టి హీరోగా నటించడం జరిగింది. ఈ చిత్రం పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ చేరారు. ఈ చిత్రం ను తాజాగా చూసిన హృతిక్, సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

కాంతార ను చూసి చాలా నేర్చుకున్నా, రిషబ్ శెట్టి చిత్రాన్ని తీసిన విధానం అసాధారణం అయినది. స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్, పెర్ఫార్మెన్స్ లు చాలా బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్ ను ఇచ్చింది. చిత్రాన్ని తీసినందుకు చిత్ర యూనిట్ కి, రెస్పెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం రిషబ్ శెట్టి వహించగా, సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు