ఆ సినిమాలో పూజా హెగ్డేనా లేక బాలీవుడ్ హీరోయినా ?

Published on Jan 21, 2021 12:30 am IST


మలయాళ స్టార్ నటుడు డుల్కర్ సల్మాన్ ఎట్టకేలకు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘మహానటి’ చిత్రంలో ఆయన నటన చూసిన తెలుగు ఆడియన్స్ ఆయన సోలో హీరోగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పారాయన. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఒక లెఫ్టినెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇది యుద్ధం నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనేది ఈ సినిమా ఉపశీర్షిక.

ఇందులో కథానాయకిగా సౌత్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పేరు వినిపించింది. ఈ సినిమా కోసం ఆమె పారితోషకం తగ్గించుకున్నారని కూడ వార్తలొచ్చాయి. కానీ ఇప్పడు మాత్రం బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపిస్తోంది. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటి మృనాల్ ఠాకూర్ ఇందులో దుల్కర్ జోడీగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త ఫేస్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఈ దిశగా ఆలోచిస్తున్నారట. మరి వీరిద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు ఇంకో రెండు భాషల్లో విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం :

More