ఒక ఏడాదికే అరవై కోట్లు సంపాదించి షాక్ ఇచ్చిన హీరోయిన్

ఒక ఏడాదికే అరవై కోట్లు సంపాదించి షాక్ ఇచ్చిన హీరోయిన్

Published on Aug 9, 2018 3:15 AM IST

priyanka chopra
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా వివిధ కారణాల రిత్యా తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా అమెరికన్ గాయకుడు నిక్ జోన్స్ తో నడుపుతున్న ప్రేమ వ్యవహారంలో కావొచ్చు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా నుండి ఉన్నట్టు ఉండి తప్పుకోవడంతో కావొచ్చు ఇలా ఆమె గురించి సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వెలువడ్డాయి.

ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి మాత్రం ప్రియాంకా చోప్రా గత ఏడాది తన సంపాదనకు సంబంధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారాం ప్రకారం 2017 సంవత్సరంకు గాను ప్రియాంకా చోప్రా 60 కోట్ల రూపాయలు సంపాదించి, బాలీవుడ్ మరియు దక్షిణ చిత్ర పరిశ్రమల హీరోయిన్స్ అందరి కంటే ఎక్కువ మొత్తం సంపాదించిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించారు. అమెరికన్ టీవీ షో క్వాంటికో మరియు అనేక ఇతర యాడ్స్ లో నటించడం కారణంగా ప్రియాంకా ఇంత పెద్ద మొత్తాన్ని సంపాదించింది.

తాజా వార్తలు