బన్నీ పాన్ ఇండియన్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్.?

బన్నీ పాన్ ఇండియన్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్.?

Published on Jan 16, 2021 9:00 AM IST

“అల వైకుంఠపురములో” భారీ ఘన విజయంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా “పుష్ప”ను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తర్వాత తన హ్యాట్రిక్ దర్శకునిగా సుకుమార్ తో ప్లాన్ చేసిన ఈ భారీ చిత్రాన్ని ఒక ఎమోషనల్ అండ్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.

మరి ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేసిన కొన్నాళ్లకే బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మరో పాన్ ఇండియా చిత్రాన్నిబన్నీ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రానికి గాను ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరోయిన్ ను లాక్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది.

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 తో ఎంట్రీ ఇచ్చిన సాయి మంజ్రేకర్. ఈమెను కొరటాల టీం లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ అంశానికి సంబంధించి కూడా అధికారిక అప్డేట్ కూడా రానున్నట్టుగా సమాచారం. మరి ఏం కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు