ఆర్ఆర్ఆర్ కోసం బాలీవుడ్ హీరోయిన్లు ?

Published on Jan 12, 2019 12:01 am IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నమల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్ ) ఇటీవల మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈచిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఫిబ్రవరిలో జరుగనుందట. ఇక ఈచిత్రం కోసం ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు అలాగే సౌత్ నుండి మరి కొంత మంది పేర్లను లాక్ చేశారట త్వరలోనే ఈ చిత్రంలో నటించే కథానాయికల పేర్లను వెల్లడించనున్నారని సమాచారం.

పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2020లో తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More