చైనా లో అదరగొడుతున్న బాలీవుడ్ చిత్రం !

చైనా లో అదరగొడుతున్న బాలీవుడ్ చిత్రం !

Published on Apr 7, 2019 4:23 PM IST

china3

గత ఏడాది ఇండియాలో అత్యంత ప్రజాధారణ పొందిన టాప్ 10 చిత్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది హిందీ చిత్రం అంధదున్. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా , టబు , రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది.

తాజాగా ఈ చిత్రాన్ని’ పియానో ప్లేయర్’ అనే టైటిల్ తో ఈనెల 3న చైనా లో విడుదల చేయగా ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లో ఈ చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద 72.72 కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇక ఈచిత్రాన్ని సౌత్ లో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తాజా వార్తలు