బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ షూట్ కంప్లీట్ చేసిన బాలీవుడ్ స్టార్ నటి

Published on Mar 15, 2023 11:31 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా పి వాసు దర్శకత్వంలో 2005 లో తెరకెక్కిన హర్రర్ తో కూడిన కామెడీ యాక్షన్ మూవీ చంద్రముఖి. ఇక రిలీజ్ అనంతరం తెలుగు, తమిళ భాషల్లో చంద్రముఖి ఎంతో పెద్ద ప్రభంజనాన్ని సృష్టించింది. అయితే ఎన్నో ఏళ్ళ తరువాత ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా చంద్రముఖి 2 ని మరింత ఆకట్టుకునేలా హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పి వాసు. నటుడు, డ్యాన్సర్, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ అందాల నటి కంగనా రనావత్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, వడివేలు, లక్ష్మి మీనన్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీలో నేటితో తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి అయిందని, నటుడు రాఘవ లారెన్స్ తో కిలిసి సెట్స్ లో దిగిన ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు కంగనా. కాగా ఇంత మంచి టీమ్ తో షూట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ముఖ్యంగా రాఘవ లారెన్స్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. రేపటి నుండి ఈ టీమ్ ని మిస్ అవుతానని, తప్పకుండా మూవీ మంచి విజయం అందుకోవాలని కోరుతూ ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీకి సంబందించిన అప్ డేట్స్ త్వరలో వరుసగా ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం :