సినీ లోకం ఓ అద్దాల మేడ అంటారు. ఆ రంగురంగుల ప్రపంచంలో అందరూ తమ కలలను నిజం చేసుకోలేరు. నానా పటేకర్ నటించిన ‘అబ్ తక్ చెప్పన్’ సినిమాకి మాటలు రాసిన రచయిత రవిశంకర్ అలోక్ (32) ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయన నివసిస్తున్న అపార్ట్ మెంట్ పై నుంచి దూకి అలోక్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా అలోక్ కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సైక్రియాటిక్ ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. అంతలోనే ఈ విషాద సంఘటన జరిగింది. రవిశంకర్ అలోక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ దగ్గర కూడా పనిచేశారు.


