ప్రభాస్ ‘ఆది పురుష్’లో మరో బాలీవుడ్ హీరో ?

Published on Jun 7, 2021 5:08 pm IST

ప్రభాస్ హీరోగా సంజ‌య్ రౌత్ దర్శకత్వంలో చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏ- ఆది పురుష్” గురించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ హల్ చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. అయితే, కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న పాత్ర గురించి ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక జులై లాస్ట్ వీక్ నుండి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అన్నట్టు మరో సౌత్ స్టార్ హీరో సుదీప్ కూడా ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే మాజీ హీరోయిన్ కాజోల్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుందని ఓ వార్త బాగా వైరల్ అయింది. అది ఫేక్ న్యూస్ అని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. మరి ఈ సారి వచ్చిన న్యూస్ లో నిజం ఎంత ఉందో చూడాలి.

కాగా దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :