స్టార్ హీరో ఇంటికి బాంబు బెదిరింపులు

Published on Jun 1, 2021 3:01 pm IST

కొలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు వెళ్లడం అలజడి సృష్టించింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తిరువాయున్మియూర్లో ఉన్న అజిత్ ఇంట్లో బాంబ్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు డాగ్ స్క్వాడ్ తో అజిత్ ఇంట్లో తనిఖీలు చేశారు. అది ఉత్తుత్తి బెదిరింపు మాత్రమేనని తేల్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

స్టార్ హీరోల ఇళ్లకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడ పలుమార్లు ఇలాంటి ఫేక్ కాల్స్ చేశారు ఆకతాయిలు. అయినా ప్రతిసారీ పోలీసులు లైట్ తీసుకోకుండా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇకపోతే అజిత్ ప్రస్తుతం హెచ్.వినోత్ దర్శకత్వంలో ‘వాలిమై’ చిత్రం చేస్తున్నారు. ఇది పూర్తైన వెంటనే వినోత్ దర్శకత్వంలోనే ఇంకొక సినిమా చేయనున్నారు.

సంబంధిత సమాచారం :