థ్రిల్లింగ్ గా అనిపిస్తున్న “బొమ్మల కొలువు” ట్రైలర్.!

Published on Aug 10, 2021 7:00 pm IST

కొన్ని క్రైమ్ అండ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి.. మరి అలాగే అనిపిస్తుంది లేటెస్ట్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న చిత్రం “బొమ్మల కొలువు” ట్రైలర్. రఘువరన్ బిటెక్ లో ధనుష్ కి తమ్ముడిగా నటించిన యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు హిరికేష్ హీరోగా నటించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ లేటెస్ట్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసారు.. అయితే సుబ్బు వేదుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కినట్టు అర్ధం అవుతుంది.

కానీ అమ్మాయిలు మిస్సింగ్ అనే మామూలు లైన్ తోనే వచ్చినా దర్శకుడి ప్రెజెంటేషన్ ఇంట్రెస్టింగ్ గా ఇందులో అనిపిస్తుంది. అంతే కాకుండా ఆ మిస్సింగ్ యువతుల విజువల్స్ కానీ ఇతర ఎలిమెంట్స్ కానీ థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తున్నాయి. అలాగే హిరికేష్ కూడా మంచి మంచి లుక్స్ అండ్ నటన కనబరిచాడు.

వీటితో పాటుగా ఫిమేల్ లీడ్స్ గ్లామర్ షో కూడా ఆకట్టుకుంటుంది. ఇక అలాగే ప్రవీణ్ లక్కరాజు ఇచ్చిన మ్యూజిక్ కూడా ఈ బ్యాక్ డ్రాప్ కి ఇంప్రెసివ్ గా ఉంది, ఇంకా ఈశ్వర్ సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా ఉంది. ఓవరాల్ గా మాత్రం ఈ ట్రైలర్ ఒకింత డెఫినెట్ థ్రిల్లర్ లానే అనిపిస్తుంది. మరి పృథ్వీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :