యూఎస్ లో మహేష్, బన్నీల సమరం ఓ రేంజ్ లో..!

Published on Jan 8, 2020 9:20 am IST

భారత చిత్ర పరిశ్రమకు అతిపెద్ద ఓవర్ సీస్ మార్కెట్ గా ఉన్న యూఎస్ లో సంక్రాంతి సినిమాలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో నువ్వా నేనా అన్నట్లు పోటీపడతున్నాయి. ఈ రెండు చిత్రాలకు అక్కడ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. జనరల్ గా యూఎస్ మార్కెట్ కింగ్ గా మహేష్ ని చెప్పుకుంటారు. ఆయన నటించిన అత్యధిక చిత్రాలు మిలియన్ మర్క్స్ దాటివేశాయి. మహేష్ చిత్రాలకు యూఎస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇక సంక్రాంతి కానుకగా వస్తున్న భారీ చిత్రం కావడంతో ఆ డిమాండ్ మరింతగా పెరిగింది.

ఇక మరో చిత్రం అల వైకుంఠపురంలో కూడా మహేష్ చిత్రానికి గట్టిపోటీ ఇస్తుంది. అక్కడ త్రివిక్రమ్ ట్రేడ్ మార్క్ వర్క్ అవుట్ అవుతుంది. క్లాస్ డైరెక్టర్ గా పేరున్న త్రివిక్రమ్ చిత్రాలకు అక్కడ యమా క్రేజ్. మొదటి షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకున్న అజ్ఞాతవాసి చిత్రం కూడా రికార్డు ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టడం అక్కడ త్రివిక్రమ్ క్రేజ్ కి ఒక ఉదాహరణ. ఇలా యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రెండు చిత్రాలు దుమ్ము రేపుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల అవుతుండగా, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :