కేజీఎఫ్‌ హీరో యష్‌పై కన్నేసిన బోయపాటి?

Published on Jul 14, 2021 2:10 am IST

కేజీఎఫ్‌ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయిన రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం కేజీఎఫ్‌-2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ పాన్ ఇండియా హీరోపై టాలీవుడ్ దర్శకుడు బోయపాటి కన్నుపడినట్టు తెలుస్తుంది. బోయపాటి సిద్దం చేసుకున్న ఓ క‌మ‌ర్షియ‌ల్ మాస్ యాక్ష‌న్ క‌థను యష్‌తో చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే తాను సిద్దం చేసుకున్న కథకు యష్ బాగా సెట్ అవుతాడని బోయపాటి భావిస్తున్నాడట. ఇక మరో కథకు తమిళ హీరో సూర్యతో కూడా బోయపాటి సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం బాలయ్యతో చేసిన అఖండ షూటింగ్ పూర్తి కావచ్చింది. అయ్యితే అఖండ‌ పూర్తవ్వగానే బోయ‌పాటి ఏ హీరోతో తన తదుపరి ప్రాజెక్టును అనౌన్స్ చేస్తాడన్నది ఇప్పుడు ఒకింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సంబంధిత సమాచారం :