సల్మాన్ సినిమా బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్రెండ్.!

Published on May 14, 2021 8:28 am IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “రాధే”. దిశా పటాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. అయితే ముంబై క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నిన్ననే జీ ప్లెక్స్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది.

రావడంతోనే భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టి భాయ్ క్రేజ్ ను మరోసారి చూపించింది. అయితే ఎప్పటిలానే పలు బాలీవుడ్ చిత్రాలకు తగిలే సెగే ఈ చిత్రానికి కూడా తగిలింది. సోషల్ మీడియాలో సల్మాన్ రాధే చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలని నెటిజన్స్ పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నట్టు కూడా అనిపిస్తుంది.

బాలీవుడ్ లో ఉండే నెపోటిజం సహా గత ఏడాది మరణించిన యూను అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సానుభూతిపరులు ఈ ట్రెండ్ లో ఉన్నారు. మరి సరైన కారణం ఏమిటో కానీ సోషల్ మీడియాలో “బాయ్ కాట్ రాధే” ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుంది.

సంబంధిత సమాచారం :