‘పుంబా’కి బ్ర‌హ్మానందం.. ‘టీమోన్’కి ఆలీ !

Published on Jun 20, 2019 1:00 am IST

డిస్నీవారు సమర్పణలో 2డి ఆనిమేటెడ్‌ సినిమాగా 1990లో వచ్చిన ‘లయన్‌ కింగ్‌’కి ప్రపంచవ్యాప్తంగా అభిమానాలు ఉన్నారు. కాగా తాజాగా ఈ సినిమాని 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో ‘లయన్‌ కింగ్‌’ మళ్ళీ తీసుకొస్తున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈ చిత్రానికి లోకల్ భాషల్లో కూడా క్రేజ్ పెరగడానికి డబ్బింగ్ ను ఆయా భాషల్లోని పేరు ఉన్న నటీనటుల చేత చెప్పిస్తున్నారు.

కాగా ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ లో పుంబా పాత్ర‌కు హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం గాత్ర‌ధానం చేయగా… టీమోన్ పాత్ర‌కు ఆలీ డ‌బ్బింగ్ చెప్పారు. తెలుగులో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, అల్లాద్దీన్ సినిమాతో మూవీ లవర్స్ ని అలరించిన డిస్నీ సంస్థ.. ఇప్పుడు లయన్ కింగ్ రూపంలో మరోసారి అలరించబోతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More