స్టార్ కమెడియన్ మళ్ళీ షూటింగ్స్ తో బిజీ కానున్నాడు !

Published on Feb 27, 2019 11:00 am IST

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం హార్ట్ సర్జరీ తరువాత తొందరగా కోలుకొంటున్నారు. సర్జరీ అనంతరం ముంబై నుండి తిరిగి వచ్చిన తరువాత ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవల ఆయన పలు సినిమాలకు సైన్ చేశారు.

ఇక కార్డియాక్ సర్జరీ తరువాత అల్లు అర్జున్ తో సహా కొందరు స్టార్ హీరోలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ వెటరన్ కమెడియన్ వచ్చే నెల నుండి మళ్ళీ సెట్ లో సందడి చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :