బ్రహ్మానందం క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేసిన కీడా కోలా టీమ్!

Published on Feb 1, 2023 11:25 am IST

రెండు వరుస హిట్‌లను అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడవ ప్రాజెక్ట్ కీడా కోలా అనే టైటిల్‌ తో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు దర్శకుడు సినిమాలోని మొదటి పాత్రను వెల్లడించాడు. కామెడీ కింగ్ బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ను తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. బ్రహ్మీ మునుపెన్నడూ లేని పాత్రలో కనిపించనున్నాడు.

స్టార్ హాస్యనటుడు వరద రాజుగా కనిపించనున్నారు, ప్రేమ – ద్వేషపూరిత సంబంధాన్ని కలిగి ఉండే ముసలి తాత. బ్రహ్మానందం కాకుండా, క్రైమ్ కామెడీ చిత్రంలో మరో 7 పాత్రలు ఉన్నాయి, అవి రాబోయే రోజుల్లో ఆవిష్కరించబడతాయి. వీజీ సైన్మా బ్యానర్‌పై కె వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎజె ఆరోన్ కెమెరామెన్ కాగా, ఉపేంద్ర వర్మ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ఫిక్స్ చేయనున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం :