ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసుకున్నా మీమ్స్ కామన్ అలాగే ఏ మీమ్స్ తీసుకున్నా అందులో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారు కామన్. బ్రహ్మానందం తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చేసిన ఎన్నో యూనిక్ రోల్స్ పై సోషల్ మీడియాలో ఏదొక ఫన్నీ మీమ్ మనం చూస్తూనే ఉంటాము. ఆయన కనిపించకుండా రోజు కూడా ఏ నెటిజన్ కు గడవదు.
జస్ట్ ఆయన ముఖ కవళికలు చూస్తేనే యిట్టె నవ్వొస్తుంది. అందుకే ఈ బ్రహ్మానందం బ్రహ్మాండమైన సినీ ప్రపంచంలో నవ్వుల రారాజుగా నిలిచారు. మరి ఆయన క్రేజ్ మన దగ్గర ఎలాంటిదో తెలిసిందే. కానీ ఇప్పుడు బ్రహ్మీ క్రేజ్ ఎట్ ఆస్ట్రేలియా అని చెప్పాల్సిందే. ఈరోజు భారత్ కు ఆస్ట్రేలియాకు మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
మరి ఈ మ్యాచ్ పై అక్కడి జర్నలిస్ట్ అయిన క్లోయె అమాండా అనే ఆమె పెట్టిన పోస్ట్ మాంచి వైరల్ అండ్ తెలుగు వారిని ప్రౌడ్ మూమెంట్ అనేలా చేసింది. అయితే ఇందులో “సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ దగ్గర ఇంకా వాన పడుతుంది, ఇది కూడా సెట్ చేసినట్టే ఉంది”. అని ఒక వార్త లైన్ టైప్ లో ఉంది.
మరి దీనికి తీరా వర్షం పడ్డాక అసలు మ్యాచ్ ఆగిపోయే రేంజ్ వర్షం పడదని చెప్పిన నా ఫ్రెండ్స్ వైపు చూస్తున్నా అంటూ బ్రహ్మానందం తాలూకా ఓ ఫోటోను పెట్టి చూపించారు. ఇది కాస్తా హిలేరియస్ గా పేలడమే కాకుండా ఆస్ట్రేలియాలో బ్రహ్మీ హవానే అంటూ మన వాళ్ళు కూడా మంచి హై లో ప్రౌడ్ గా ఫీలవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం బ్రహ్మానందం గారి క్రేజే వేరే లెవెల్ అని చెప్పాలి.
It is still raining here at the SCG. It looks set in too!
Me looking at my weather friends who said it won’t rain enough to affect play:
???????????????? #AUSvIND pic.twitter.com/FUJooncXlf
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) January 7, 2021


