బన్నీకు అద్భుతమైన బహుమతి ఇచ్చిన బ్రహ్మానందం.!

Published on Jan 1, 2021 3:07 pm IST

మన తెలుగు చిత్ర పరిశ్రమలో నవ్వుల ఱేడు లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గారిని తలుచుకుంటే తెలుగు ప్రేక్షకులు ఎక్కడ ఉన్నా సరే ఆనందంతో నవ్వు వికసిస్తుంది. అయితే మరి ఒక్క నవ్వించడమే కాకుండా ఆయనలో ఒక అద్భుతమైన చిత్రకారుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి చిత్రం అయినా కుంచె పట్టారంటే అచ్చు పడిపోవాల్సిందే.

మరి అలా తాను వేసిన ఒక అద్భుత చిత్రపటాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ నూతన సంవత్సర కానుకగా అందజేశారు. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా తెలియజేసాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బ్రహ్మానందం మొత్తం 45 రోజులు కస్టపడి స్వయంగా తన చేతులతోనే పెన్సిల్ తో వేశారని బన్నీ తెలిపాడు. ఆయనకు తనకు ఇలాంటి వెలకట్టలేని బహుమతిని అందించడం చాలా సంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలిపి ఆనందం వ్యక్తం చేసాడు.

సంబంధిత సమాచారం :