స్టార్ కమెడియన్ కి ట్రాజెడీ రోల్ సెట్ అవుతుందా ?

Published on Aug 2, 2020 2:07 am IST

క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ రీమేక్ చేస్తోన్న ‘రంగమార్తాండ’ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక ట్రాజెడీ రోల్ లో నటిస్తున్నారు. ఆయన పాత్ర పూర్తిగా బలమైన భావోద్వేగాలతోనే సాగుతుందని… ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయని.. అలాగే సినిమాలో బ్రహ్మానందం పాత్ర చనిపోతుందని.. ఆ చనిపోయే సన్నివేశంలో బ్రహ్మానందం ప్రేక్షకులను ఏడిపిస్తారట. మరి బ్రహ్మానందంకు ట్రాజెడీ రోల్ సెట్ అవుతుందా అన్నదే అనుమానం.

అయితే గతంలో బ్రహ్మానందం చేసిన ఏమోషనల్ పాత్రల్లో ‘బాబాయ్ హోటల్’ సినిమాలోని బాబాయ్ పాత్ర ఒకటి. నిజానికి ఆ సినిమా బాగున్నా.. ఆడాల్సిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. మరి ‘రంగమార్తాండ’ ఎలా ఉంటుందో చూడాలి. ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా ‘కృష్ణ వంశీ’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాతో కృష్ణవంశీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More