
20 ఏళ్ళుగా తెలుగు ప్రజలను బుల్లితెర ద్వారా ప్రతి రోజూ ఎంటర్టైన్ చేస్తున్న టీవీ ఛానల్ ఈ టీవీ. రామోజీ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత రామోజీ రావు స్థాపించిన ఈ టీవీ ఛానల్ ఇటీవలే 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ళుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ తెలుగు ప్రజల అభిమానాన్ని గెలుచుకున్న ఈ టీవీ బ్రాండ్ నుంచి వచ్చిన న్యూస్ ఛానల్స్ అయిన ఈ టీవీ తెలంగాణ న్యూస్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్స్ కూడా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి. ఇప్పుడు రామోజీ రావు ఈ టీవీ అనే బ్రాండ్ నుంచి మరో నాలుగు సరికొత్త టీవీ ఛానల్స్ ని లాంచ్ చేయనున్నాడని ఇదివరకే తెలియజేశాం..
ఆ ఛానల్స్ పేర్లే.. ఈ టీవీ ప్లస్. ఈ టీవీ లైఫ్. ఈ టీవీ అభిరుచి మరియు ఈ టీవీ సినిమా. ఈ నాలుగు ఛానల్స్ ని నవంబర్ 14వ తేదీన రామోజీ రావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. ఈ చానల్స్ లో ఈ టీవీ ప్లస్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఈ టీవీ ప్లస్ అనేది 24 గంటలు ప్రేక్షకులను నవ్వించే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఛానల్. అలా అని సినిమాలోని కామెడీ బిట్స్ వేసి వీరు నవ్వించరు.. 24 గంటల పాటు కామెడీ రియాలిటీ షోస్ తో, ఎంతో మంది కమెడియన్స్ తెగ నవ్వించడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే ఆలు కామెడీ రియాలిటీ షోస్ రామోజీరావు గారి నుంచి వస్తున్న ఈ 24 గంటల కామెడీ ఛానల్ సక్సెఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటూ టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం మొదటిసారి బుల్లితెరపై ఓ రియాలిటీ షో చేసారు.
ఈ టీవీ ప్లస్ లాంచ్ అవ్వగానే నవంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ప్రోగ్రామ్ ‘కేరింత’దీనికి ట్యాగ్ లైన్ ‘సెలబ్రేషన్ అఫ్ కామెడీ’. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రోగ్రామ్ కి బ్రహ్మానందం చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మొదట చీఫ్ గెస్ట్ గా ఎంటర్ అయిన బ్రహ్మానందం ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా మారడమే కాకుండా కంటిన్యూగా పంచ్ లు వేసి ప్రోగ్రామ్ అంతా నవ్వులే నవ్వులు అనుకునేలా తీర్చిదిద్దాడు. అంతే కాకుండా బ్రహ్మానందం గారు ఈ కేరింత షోలో డాన్స్ స్టెప్పులు కూడా వేసాడు. వీటితో పాటు బ్రహ్మానందం ఇండస్ట్రీలోని కమెడియన్స్, జబర్దస్త్ బ్యాచ్ మరియు యాంకర్స్ మరియు జడ్జ్ లతో చేసిన అదిరిపోయే కామెడీ చూడాలంటే నవంబర్ 14న కేరింత ప్రోగ్రామ్ ప్రసారం అయ్యేదాకా వేచి చూడాల్సిందే..
రామోజీరావు లాంచ్ చేయనున్న ఈ టీవీ ప్లస్ ఛానల్ లో లాంచ్ అయ్యే ప్రోగ్రామ్స్ పూర్తి వివరాల కోసం మా 123తెలుగు.కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

